అకడమిక్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి- TTF

 ⁠⁠⁠🔸విద్యా ప్రణాళికలేని విద్యాశాఖ 🔹సబ్జెక్టు ఉపాధ్యాయుల మధ్య తగవుపెట్టి చోద్యంచూస్తున్న అధికారులు 🔸10వ తరగతి సైన్స్ పేపర్ రెండుగా విభజించిలి.100 మార్కుల చొప్పున కేటాయించాలి. పాఠశాలలు ప్రారంభమైఇప్పటికి నెల రోజులు దాటింది. ఇప్పటి వరకు కూడ రాష్ట్ర విద్యాశాఖ అకడమిక్ క్యాలండర్ విడుదలచేయకపోవడం పట్ల టిటిఎఫ్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుంది.      ఉన్నత పాఠశాలల్లో ఫిజికల్ సైన్స్ , గణిత ఉపాధ్యాయుల మధ్య 6,7 తరగతుల గణితం బోధన విషయంలో తీవ్ర గందరగోళం నెలకొని విద్యాబోధనకు ఆటంకం కలిగి ఆ రెండు సబ్జెక్టు ఉపాధ్యాయుల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంటే ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకొని కూర్చోవాల్సి వస్తుంటే నిర్ణయం చెప్పాల్సిన విద్యాశాఖాధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.రాంచంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.రఘునందన్ అన్నారు.  ఇప్పటికి కూడా అకడమిక్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం పట్ల ఇటు ఉపాధ్యాయులు అటు ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో ఉండి పాఠశాల నిర్వహణలో తీవ్ర గందరగోళపరిస్థితులు నెలకొన్నాయని వారన్నారు. ఇవన్ని కావాలనే కాలయాపనచేస్తున్నట్లుగా ఉందని వారన్నారు. కావున వెంటనే సమగ్రమైన అకడమిక్ క్యాలండర్ రూపొందించి తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని  టిటిఎఫ్ రాష్ట్ర శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.        10 వ తరగతి సైన్స్ పేపర్ ను బయాలాజికల్ సైన్స్ 100 మార్కులుగా, ఫిజికల్ సైన్స్ 100 మార్కులుగా కేటాయించి ఆ రెండు సబ్జక్టులను రెండుసపరేట్ పేపర్స్ గ విభజించాలని , అప్పుడే విద్యార్థులు  సైన్స్ సబ్జక్టులో  చక్కగ రాణిస్తారని దానితో ప్రతి సబ్జక్టు 100 మార్కుల పేపర్ ఉండడం వలన సబ్జక్టు ఉపాధ్యాయుల మధ్య అనవసర గొడవలకు ఆస్కారం ఉండదని ఆ దిశలో ప్రభుత్వం ఆలోచించి సత్వర నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులకోణంలో ఆలోచించాలని వారు కోరారు. >ఇ.రఘునందన్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.